
సినిమాలు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బుధవారం కోకాపేట్‌లో నిర్వహించిన విలువైన భూముల ఈ-వేలానికి భారీ స్పందన లభించింది. గోల్డెన్ మైల్ సైట్-1లోని 0.70 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు రూ.70 కోట్లను అప్‌సెట్ ధరగా నిర్ణయించగా.. అత్యధికంగా ఎకరాకు రూ.115 కోట్ల బిడ్ నమోదైంది. దీంతో నిర్ణయించిన ప్రారంభ ధరతో పోలిస్తే బిడ్ గణనీయంగా పెరిగింది.
నియోపోలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17 మొత్తం 4.59 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్లాట్‌కు ఒకే ఒక్క బిడ్ దాఖలైనప్పటికీ.. ఎకరాకు రూ.120 కోట్ల ధర నమోదైంది. కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాల్లో ప్రీమియం భూములకు ఉన్న డిమాండ్‌ను తాజా ఈ-వేలం మరోసారి చాటిచెప్పింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!