10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Chandrika 08:33 AM, 10 సెప్టెంబర్, 2026
ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు జరిగిన అన్ని పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బాధ్యులను ఎవరినీ వదలకుండా విచారణ జరిపి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని శాసనసభలో చెప్పారు. దళితులు, స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, మహిళా పోలీసులపై దాడులకు సంబంధించిన ఫిర్యాదులపై ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నియంత్రణ చట్టం కింద ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో విచారణ చేపడతామని వెల్లడించారు. విచారణ అధికారిగా హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ను నియమించే అంశాన్ని ప్రకటించారు. ప్రభుత్వం స్పీకర్‌కు అండగా ఉంటుందని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారని రేవంత్‌రెడ్డి ధైర్యం చెప్పారు.

ఫాంహౌస్‌లో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై కుట్రకు ప్రణాళిక రచించారని, సభ్యులను దాడులకు ప్రేరేపించారని సీఎం ఆరోపించారు. సభలో విద్య, ధరణి, 22-ఏ భూములు, ఇతర ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. దళిత ప్రతినిధులు ఫాంహౌస్‌ వద్ద నిరసన తెలిపిన అనంతరం అక్కడ శుద్ధీకరణ చేపట్టినట్లు వచ్చిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అంటరానితనం, వివక్షకు ప్రజా ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఫాంహౌస్‌ ఘటన నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటినీ క్రోడీకరించి, చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ శాసనసభతెలంగాణ రాజకీయాలుఫాంహౌస్‌ వివాదంబీఆర్‌ఎస్‌కేసీఆర్‌దళిత హక్కులుఎస్సీ ఎస్టీ చట్టంశాసనసభ స్పీకర్‌తెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?
సినిమాలు

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే
ఆరోగ్యం

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?
సినిమాలు

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ
జనరల్

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?

బిగ్‌బాస్‌ తెలుగు 10: సింపుల్‌ నేచర్‌తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సింపుల్‌ నేచర్‌తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ

మరెమ్మ మూవీ రివ్యూ: మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ‘మరెమ్మ’ ఎలా ఉందంటే?
రివ్యూలు

మరెమ్మ మూవీ రివ్యూ: మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ‘మరెమ్మ’ ఎలా ఉందంటే?

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌
జనరల్

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..
జనరల్

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు
జనరల్

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!