

నవంబర్‌లో జరగనున్న అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడిని ఇరాన్ ఎక్కువకాలం తట్టుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో చర్చలకు అవకాశం ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం చర్చలపై దృష్టి పెట్టలేదని ట్రంప్ తెలిపారు.
యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే అమెరికా రాజకీయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు ట్రంప్ ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నాయి. నవంబర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ తీవ్రతను నియంత్రించేందుకు ట్రంప్ సలహాదారులు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలతో అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!