

మాజీ వైఎస్సార్‌సీపీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తనకు, తన తల్లిదండ్రులకు అత్తమామలు జోగి రమేష్, శకుంతల, భర్త రాజీవ్, ఇతర కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు, తనను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను ఆశ్రయించారు. బుధవారం తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన మేఘన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.
తన వివాహం కోసం తల్లిదండ్రులు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అదనంగా రూ.5 కోట్ల కట్నంతో పాటు ఖరీదైన కార్లు, వజ్రాల నెక్లెస్, వజ్రపు ఉంగరం తీసుకురావాలని అత్తమామలు వేధించారని ఆరోపించారు. గోవా పర్యటన సందర్భంగా తనకు ఈత రాదని తెలిసినా భర్త పడవపై నుంచి నీటిలోకి నెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, కేసును తెలంగాణకు బదిలీ చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు మేఘన తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!