

అగ్రరాజ్యం అమెరికా అప్పులు రికార్డు స్థాయికి చేరాయి. ఆగస్టు 19 నాటికి అమెరికా మొత్తం అప్పులు 40.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది సుమారు రూ.3,896 లక్షల కోట్లకు సమానం. మార్చిలో అమెరికా అప్పులు దాదాపు 39 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా. కేవలం ఐదు నెలల్లోనే మరో 1.7 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగాయి. రక్షణ వ్యయం, సంక్షేమ పథకాల చెల్లింపులు, ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రుణభారం పెరిగినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
అమెరికా రుణభారం పెరుగుతున్నప్పటికీ జీడీపీతో పోలిస్తే అది పరిమితిలోనే ఉందని వైట్‌హౌస్ పేర్కొంది. ప్రభుత్వ వ్యయంలో వృథా, దుర్వినియోగం, మోసాలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపింది. అయితే పెరుగుతున్న రుణాల కారణంగా వడ్డీ రేట్లు పెరిగి ప్రజలు, వ్యాపారాలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలే అధిక రుణభారాన్ని కలిగి ఉన్నాయని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!