
జనరల్

రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ కేర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునర్జీవం పోస్తూ భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నగర అభివృద్ధికి కూడా దోహదం జరుగుతోందని చెప్పారు.
ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. చెరువులను కాపాడటం అంటే కేవలం నీటి వనరులను సంరక్షించడం మాత్రమే కాకుండా భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం కూడా అని అన్నారు. ప్రతి చెరువును రక్షిస్తూ ప్రజా ఆస్తిని సంరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!