

కూకట్‌పల్లిలోని 13 ఎకరాల వివాదాస్పద భూమి విషయంలో తెలంగాణ హైకోర్టు జోక్యంతో హైడ్రా వెనక్కి తగ్గింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే తమ భూమిని అక్రమంగా ఆక్రమించిందంటూ భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, 24 గంటల్లో భూమిని యథావిధిగా పిటిషనర్లకు అప్పగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు భూ యజమానులు తిరిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా హైడ్రా ఇకపై ఆ భూమి జోలికి వెళ్లబోదని కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడాలో ప్రభుత్వ భూమి పేరుతో 28 ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సరైన నోటీసులు లేకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించిన హైకోర్టు, సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!