12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

Writer: Chandrika 08:57 AM, 12 సెప్టెంబర్, 2026
టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల తీరు క్రమంగా మారుతోంది. గతంలో వినోదం, ప్రేమకథలకు పెద్దపీట వేసిన హీరోలు ఇప్పుడు రా అండ్ రస్టిక్ టచ్‌తో కూడిన వైలెంట్ కథలను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా బలమైన భావోద్వేగాలతో పాటు భారీ యాక్షన్, రక్తపాతంతో కూడిన డ్రామాను ఆదరిస్తుండటంతో యంగ్ హీరోలు తమ ఇమేజ్‌కు భిన్నమైన పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ వంటి హీరోలు ముందున్నారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రణబాలి బ్రిటిష్ పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో విజయ్ ఉగ్రమైన పాత్రలో కనిపించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఘర్షణలు, పోరాటాలు, రక్తపాతంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

నాని ఇప్పటికే దసరాతో ఊరమాస్, వైలెంట్ అవతారాన్ని చూపించారు. ఇప్పుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ది పారడైజ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి వైలెన్స్, భావోద్వేగాలతో సాగే ఈ కథలో రస్టిక్ యాక్షన్ కీలకంగా ఉండనుంది. సాయి ధరమ్ తేజ్ కూడా రోహిత్ కెపి దర్శకత్వంలోని సంబరాల ఏటిగట్టుతో వైలెంట్ జానర్‌లోకి వస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో పగ, ప్రతీకారాల చుట్టూ సాగే ఈ కథలో యాక్షన్ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న భోగీ కూడా రక్తపాతంతో కూడిన మాస్ యాక్షన్ కథగా రూపొందుతోంది. ఇందులో శర్వా ఇప్పటివరకు చూడని వైలెంట్ అవతారంలో కనిపించనున్నారని సమాచారం. మరి ఈ కొత్త ప్రయోగాలు హీరోలకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్దార్ 2పై ట్రోలింగ్?

సర్దార్ 2పై ట్రోలింగ్?

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

ట్యాగ్లు
టాలీవుడ్‌తెలుగు సినిమావిజయ్‌ దేవరకొండనానిసాయి ధరమ్‌ తేజ్‌శర్వానంద్‌రణబాలిది పారడైజ్‌సంబరాల ఏటిగట్టుభోగీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్దార్ 2పై ట్రోలింగ్?
సినిమాలు

సర్దార్ 2పై ట్రోలింగ్?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?
గాసిప్స్

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!
సినిమాలు

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?
రాజకీయాలు

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
జనరల్

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...
సినిమాలు

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు
టెక్నాలజీ

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..
బిజినెస్

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!