

టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా టోల్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో మాట్లాడిన ఆయన, 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. FASTag కారణంగా ఇప్పటికే టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వేచి చూసే సమయం గణనీయంగా తగ్గిందని చెప్పారు.
గతంలో టోల్‌బూత్‌ల వద్ద సగటున 12 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని, కొన్ని సందర్భాల్లో 30 నిమిషాలు కూడా పట్టేదని గడ్కరీ తెలిపారు. FASTag వల్ల ఈ సమయం 80–90 శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం బ్యారియర్ లేని టోల్‌బూత్‌ల కోసం పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 శాతం టోల్‌బూత్‌ల వద్ద అడ్డంకులు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2027 మార్చి నాటికి 100 శాతం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Automatic Number Plate Recognition (ANPR) సాంకేతికతను FASTag ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్‌తో అనుసంధానించడం ద్వారా వాహనం ఆగకుండానే టోల్ వసూలు చేయవచ్చని వివరించారు.

కామెంట్స్ (1)
Great idea 💡