12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 05:51 AM, 12 సెప్టెంబర్, 2026
ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15న షార్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందులో ఖాళీల వివరాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్షల షెడ్యూల్‌ వంటి అంశాలను వెల్లడించనుంది. సిలబస్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌, ఇతర నియామక మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ అక్టోబర్‌ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. జులై 1 నాటికి ఉన్న వయసును అర్హతకు ప్రాతిపదికగా తీసుకోనున్నారు. కొత్తగా విద్యార్హతలు పూర్తి చేసిన అభ్యర్థులు వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అదనపు అర్హతలు సాధించినవారు తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్‌-1 పోస్టుల జాబితాలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియామక ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సమస్యలు దాదాపు పరిష్కారమైనట్లు తెలుస్తోంది.

సవరించిన గ్రూప్‌-1 జాబితాలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక శాఖ గతంలో అనుమతించిన 149 పోస్టులకు అదనంగా వయోజన విద్య అసిస్టెంట్‌ డైరెక్టర్‌/ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాధికారి తదితర పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఎంపీడీవో పోస్టును జాబితా నుంచి తొలగించగా, జిల్లా పంచాయతీ అధికారి స్థానంలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టును చేర్చారు. అలాగే డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ స్థానంలో జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టును మార్చారు. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులను మల్టీజోన్‌ పోస్టులుగా మార్చారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలను మాన్యువల్‌గా నిర్వహించి, మిగతా నియామక పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే దిశగా ఏపీపీఎస్సీ ఆలోచిస్తోంది. ఆన్‌లైన్‌ పరీక్షల్లో నార్మలైజేషన్‌ విధానంపై నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

రైలు టికెట్ల బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు!

రైలు టికెట్ల బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు!

ట్యాగ్లు
ఏపీపీఎస్సీఏపీ జాబ్‌ క్యాలెండర్‌గ్రూప్‌ 1 ఉద్యోగాలుప్రభుత్వ ఉద్యోగాలుఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాలుఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ఉద్యోగ నియామకాలుప్రభుత్వ నియామకాలుఏపీపీఎస్సీ పరీక్షలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..
బిజినెస్

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!
జనరల్

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!
జనరల్

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!
జనరల్

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!