

ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం భారత పరిపాలనా సేవకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆమె ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం లండన్‌లోని ఫైనాన్స్ ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసుల్లో చేరారు. తన సర్వీసులో సంత్ కబీర్ నగర్, మిర్జాపూర్, దేవరియా జిల్లాల కలెక్టర్‌గా సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
మిర్జాపూర్‌లో పనిచేసిన సమయంలో లహురియాదహ్ గ్రామానికి పైపుల ద్వారా తాగునీటిని అందించేందుకు చేసిన కృషితో దివ్య మిట్టల్ ప్రత్యేక గుర్తింపు పొందారు. దశాబ్దాలుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న గ్రామానికి ఈ సదుపాయం అందించడం ఆమె సేవలో ముఖ్యమైన విజయంగా నిలిచింది. అయితే నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదన్న అంశంతో రాజకీయ విభేదాలు తలెత్తాయని, అవే ఆమె బదిలీకి కారణమయ్యాయని ప్రచారం జరిగింది. కానీ తన రాజీనామాకు రాజకీయ ఒత్తిడే కారణమని దివ్య మిట్టల్ వెల్లడించలేదు. గత కొన్ని నెలలుగా ఉద్యోగం నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!