
జనరల్

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఐదుగురు సభ్యుల బెంచ్ సుభాష్ చంద్రకు సంబంధించిన రూ.6.25 కోట్ల రీపేమెంట్ ప్లాన్‌పై ఆగస్టు 25న ఇచ్చిన ఆమోద ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ కేసులో స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం వెలువడలేదని బెంచ్ పేర్కొంది. దీంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
అలాగే కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సుభాష్ చంద్ర ఎలాంటి ఆస్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బదిలీ చేయకుండా NCLT ఆంక్షలు విధించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో సంబంధిత పక్షాల స్పందన అనంతరం ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!