
సినిమాలు

ఇజ్రాయెల్‌కు అమెరికానే ఏకైక నిజమైన మిత్రదేశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. అమెరికా తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ, భారత్ వంటి నమ్మకమైన సన్నిహిత మిత్రదేశాలు కూడా తమకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో ఇజ్రాయెల్‌కు మంచి ఆదరణ, మద్దతు లభిస్తోందని నెతన్యాహు తెలిపారు. ప్రపంచంలోని పలువురు దేశాధినేతలు బహిరంగంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా అభివర్ణించిన ఆయన, జేడీ వాన్స్‌పై గౌరవం ఉన్నప్పటికీ ఆయన చెప్పే ప్రతి విషయంతో తాను ఏకీభవించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!