
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు డెంగీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని పుణేలోని భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు వెల్లడించారు. 12 ఏళ్ల గణాంకాల ఆధారంగా చేసిన అధ్యయనంలో సరైన వర్షాలు లేకపోతే దోమల గుడ్లు, లార్వాలు ఎక్కువకాలం జీవించి వేగంగా పెరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.
ఈ పరిశోధన ఆధారంగా వాతావరణ పరిస్థితులను విశ్లేషించి డెంగీ వ్యాప్తిపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఆరోగ్య శాఖలు ముందస్తు చర్యలు తీసుకుని డెంగీ నియంత్రణను మరింత సమర్థంగా నిర్వహించగలవని పరిశోధకులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!