
సినిమాలు

రైలు టికెట్ల తనిఖీలకు సంబంధించి ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణ సమయంలో ఐఆర్‌సీటీసీ యాప్‌లోని అసలు ఈ-టికెట్, అధికారిక బుకింగ్ నిర్ధారణ సందేశం లేదా ప్రింటెడ్ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించింది. దీంతో టికెట్ తనిఖీ ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని తెలిపింది.
టికెట్లలో మార్పులు, నకిలీ టికెట్లు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ సూచనలు జారీ చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. టికెట్ తనిఖీ సమయంలో ధ్రువీకరించలేని లేదా మార్పులు చేసిన టికెట్ కాపీలపై ఆధారపడకుండా, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను చూపించాలని ప్రయాణికులకు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!