
సినిమాలు

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్రధాని తెలిపారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ద్వారా బాధిత భారతీయులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటూ బాధితులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!