
జనరల్

ఢిల్లీలో నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డ్రగ్స్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మాదకద్రవ్యాల నిర్మూలన కీలకమని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లు డ్రగ్స్‌పై పోరాటంలో అత్యంత ముఖ్యమైన దశగా నిలుస్తాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం సమిష్టి ప్రయత్నాలు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!