

ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగితే.. ఆ దేశంలోని కీలక సైనిక, భద్రతా అధికారులను లక్ష్యంగా చేసుకుని పేజర్ తరహా రహస్య ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మొసాద్ మాజీ గ్లోబల్ ఆపరేషన్స్ డిప్యూటీ హెడ్ ఒడెడ్ ఐలామ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ కథనాలు ప్రచురితమయ్యాయి. 2024లో హెజ్‌బొల్లా సభ్యులు ఉపయోగించే పేజర్లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్లు సంభవించిన ఘటనను పోలిన వ్యూహాన్ని ఇరాన్ విషయంలోనూ అనుసరించే అవకాశముందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే, ఇలాంటి ఆపరేషన్ ఇప్పటికే అమలులో ఉందా లేదా అన్నది అధికారికంగా ధ్రువీకరణ కాలేదు.
ఇరాన్‌లో అసలు అధికార కేంద్రాలు సైనిక, భద్రతా వ్యవస్థల చేతుల్లోనే ఉన్నాయని ఐలామ్ పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అహ్మద్ వాహిది, బసిజ్ దళాల అధిపతి హుస్సేన్ తాయెబ్, సైనికాధికారి అలీ అబ్దుల్లాహి, మొహ్సెన్ రెజాయిల పేర్లను ప్రస్తావించారు. అమెరికాతో ఒప్పందం, హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ నాయకత్వంలో విభేదాలు ఉన్నాయని కూడా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన నిరసనల సందర్భంగా 75 వేల మంది మరణించారన్న వాదనకు విశ్వసనీయ ధ్రువీకరణ లేదు. బ్రిటన్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, అప్పటి మరణాల అంచనాలు 12 వేల నుంచి 20 వేల వరకు ఉండగా, మానవ హక్కుల సంస్థ ఒకటి 6,221 మరణాలను ధ్రువీకరించినట్లు పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!