
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓ స్ఫూర్తిదాయక ఘటన చోటుచేసుకుంది. రెండు నెలల పసికందును వెంట తీసుకొచ్చిన ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చంటి బిడ్డను చూసుకుంటూనే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఆమెను పలువురు అభినందించారు. చిన్నారితో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలనే ఆమె నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని, పౌరుల బాధ్యతను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!