

రూ.1,000 కోట్ల విలువైన విదేశీ చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 9 ప్రాంతాలు, విశాఖపట్నంలో 3 ప్రాంతాలు, గుంటూరులో ఒక ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనాకు నిధుల బదిలీలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.
విశాఖపట్నానికి చెందిన స్టాక్‌పైల్ సాఫ్ట్‌టెక్‌కు సంబంధించిన సుమారు రూ.900 కోట్ల విదేశీ చెల్లింపులపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గుంటూరులో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.130 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. సేవల పేరుతో విదేశాలకు నిధులు మళ్లించారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల్లోని సంస్థలకు చేసిన చెల్లింపులను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ, హవాలా, అంగడియా మార్గాల ద్వారా నిధుల తరలింపు జరిగిందా అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!