
జనరల్

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎల్. లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్. ఈశ్వర రావు పాల్గొన్నారు.
శ్రీ లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని పలువురు నేతలు ప్రతిపాదించారు. ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ఎంపీలు వి. బాలశౌరి, టి. ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతకుముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రమేష్ బి-ఫామ్ స్వీకరించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!