

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందించే రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది.
ప్రస్తుతం ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిలో జరిగే వెరిఫికేషన్, ఎమ్మెల్యే ఆమోదం, చెక్కుల పంపిణీ వంటి ప్రక్రియల కారణంగా వేలాది దరఖాస్తులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు డీబీటీ విధానాన్ని అమలు చేయడంతో పాటు చెక్కుల ముద్రణ, పంపిణీ, గడువు ముగిసే సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!