

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ కోచ్ సితాన్షు కోటక్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ ఆటలోని లోపాలు, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విధానం, షాట్ ఎంపికపై ఇద్దరు కోచ్‌లు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించకుండా, ముందుగా పిచ్‌ను అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని గంభీర్ సూచించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శాంసన్ స్థానంలో జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌ల్లో 14, 13, 15 పరుగులకే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లు అతని షార్ట్ బాల్ బలహీనతను లక్ష్యంగా చేసుకోవడంతో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. భారత బ్యాటింగ్ విఫలం కావడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జట్టు సిరీస్‌ను కోల్పోయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!