
ఆరోగ్యం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మంత్రి పదవి నుంచి ఇటీవల బర్తరఫ్ అయిన కొండా సురేఖ దూరంగా ఉన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో సురేఖ తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల మొత్తం ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై ఆమె నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!