
గాసిప్స్

హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బోనాల జాతర సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, వీధులు భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి.
బోనాల ఉత్సవం సందర్భంగా నగరం మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంది. వీధుల్లో భక్తుల కోలాహలం, బోనాల సందడి కనిపిస్తోంది. భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా బోనాల మహోత్సవాన్ని భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!