

హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటు చేసే దిశగా ఆ విద్యాసంస్థ కృషి చేస్తోందని ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలిపారు. లండన్‌లోని సెనేట్ హౌస్‌లో సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ అధికారులు కె. రామకృష్ణారావు, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్ ద్వారా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల పరిధిలో విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, కార్యక్రమాలను అందించాలని యోచిస్తున్నట్లు ప్రతినిధులు వివరించారు. యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే దిశలో కీలక అడుగుగా భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!