
గాసిప్స్

ఈ20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ వినియోగంపై నెలకొన్న సందేహాలకు మహీంద్రా అండ్ మహీంద్రా స్పష్టత ఇచ్చింది. తమ ప్రస్తుతం ఉన్న అన్ని పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమని, దీని వల్ల ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదా యాంత్రిక సమస్యలు తలెత్తవని కంపెనీ వెల్లడించింది.
అలాగే 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలను ఈ20 ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు తెలిపింది. దీంతో మెరుగైన పనితీరు, వేగం, ఇంధన సామర్థ్యం లభిస్తాయని పేర్కొంది. పాత మోడళ్లలో స్వల్ప మైలేజ్ తేడా ఉండొచ్చని, అయితే భద్రత పరంగా ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!