
జనరల్

భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష పలు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ డాక్టర్ ఎ. సోనీ బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్, కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026, పారా అథ్లెటిక్ సపోర్ట్ ప్రోగ్రామ్, స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ఎల్బీ స్టేడియంలో ఆధునికీకరించిన తెలంగాణ ఒలింపిక్ భవన్, మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!