
రాజకీయాలు

హైదరాబాద్ శివారు గండిపేటలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను కాంచీపురం, తమిళనాడులో సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం గండిపేట సర్వే నంబర్ 18లోని 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. నకిలీ జీవోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఖాతా నుంచి ₹1.25 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 9 మందిపై కేసులు నమోదు కాగా పలువురు పరారీలో ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!