
జనరల్

ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన ఆయుధ డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల సందర్భంగా మావోయిస్టులకు చెందినవిగా భావిస్తున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ తనిఖీల్లో మొత్తం 711 గ్రెనేడ్ లాంచర్ షెల్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ నిల్వలను గుర్తించేందుకు కొనసాగుతున్న చర్యల్లో ఈ స్వాధీనం కీలకంగా భావిస్తున్నారు. ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!