
టెక్నాలజీ

నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్సీసీ) వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో ఏవీఎస్ రాజు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఎన్సీసీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పేదలకు ఏవీఎస్ రాజు అండగా నిలిచారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు. ఈ విషాద సమయంలో ఏవీఎస్ రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!