

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను 15 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. దీంతో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు సంబంధించిన వార్షిక ఫీజులు మరింత పెరగనున్నాయి.
మరోవైపు తెలంగాణలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశించింది. టీజీఏఎఫ్‌ఆర్‌సీ, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను కాలేజీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ కోర్సు వ్యవధికి మాత్రమే ఫీజు వసూలు చేయాలని, ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులను తరగతులకు దూరం చేయరాదని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!