

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. జింబాబ్వే పర్యటనలో గాయపడిన యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో అతడు ఉత్తీర్ణత సాధించినట్లు ‘ఆజ్ తక్’ కథనం పేర్కొంది. దీంతో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న అఫ్గాన్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపికకు ప్రిన్స్ అందుబాటులో ఉండనున్నాడు.
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బౌలింగ్ చేస్తుండగా ప్రిన్స్ తొడ కండరాలు పట్టేయడంతో 2.2 ఓవర్లకే మైదానం వీడాడు. అనంతరం మూడో టీ20కి దూరమైన అతడు బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాసం పొందాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆకట్టుకున్న ప్రిన్స్.. ఇప్పటివరకు భారత్ తరఫున 3 వన్డేలు, 6 టీ20లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!