

రక్షాబంధన్ సందర్భంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో తెలంగాణకు చెందిన విద్యార్థిని ఎం. రాధిక పాల్గొని అరుదైన గౌరవాన్ని అందుకుంది. తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. గాంధారి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాధిక కూడా ఈ బృందంలో చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపే అవకాశం విద్యార్థులకు లభించింది.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు రాష్ట్రపతితో కలిసి ఫొటో దిగారు. దిల్లీకి వెళ్లి పాఠశాలకు, మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన రాధికను పాఠశాల ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొనడం తమ పాఠశాల విద్యార్థికి దక్కిన అరుదైన అవకాశమని వారు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!