
ఓటీటీ

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు గాయం కారణంగా ఎదురుదెబ్బ తగిలింది. శిక్షణ సమయంలో చీలమండకు లిగమెంట్ టియర్ అయినట్లు నీరజ్ వెల్లడించాడు. దీంతో 2026 సీజన్‌లో మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వైద్యులు, తన బృందంతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఈ గాయం కారణంగా సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ పాల్గొనే అవకాశం కోల్పోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టనున్నట్లు నీరజ్ పేర్కొన్నాడు. అభిమానులు, క్రీడా వర్గాలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!