

తెలంగాణ రైజింగ్-2047 అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాధించాల్సిన అభివృద్ధి విజన్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్‌లో ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’ (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి, ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి రంగాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు కేవలం అనుసరణ నిపుణులుగా కాకుండా వ్యూహాత్మక బోర్డు సలహాదారులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్‌ఐ ప్రతినిధులు మహదేవ్ తిరునగరి, ఎం. దామోదరన్, శిల్పా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!