10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

Writer: Harika S 04:45 PM, 25 ఆగస్టు, 2026
సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగులు పడ్డాయి. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్‌ను కూడా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రాజెక్టులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించడంతో పాటు సంస్థ ప్రదర్శించిన ఏవీని వీక్షించారు. సుజ్లాన్ ప్రతినిధులతో మాట్లాడి ప్రాజెక్టుల పురోగతి, పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సుజ్లాన్ సంస్థ చేపట్టనున్న విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో అనంతపురం జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

అంతకుముందు మంత్రి నారా లోకేష్ బళ్లారి సమీపంలోని హలకుంది గ్రామంలో ఉన్న సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించారు. సంస్థ ప్రతినిధులతో మాట్లాడి కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విండ్ టర్బైన్‌పై సంతకం చేశారు.

ప్రస్తుతం ఏపీలో 1,700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యంతో సుజ్లాన్ కీలక విండ్ ఎనర్జీ భాగస్వామిగా ఉంది. 2030 నాటికి అదనంగా 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ. లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, సుజ్లాన్ గ్రూప్ కో-ఫౌండర్, వైస్ చైర్మన్ గిరీష్ తంతి పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పనమాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన దేశం.. భవనాలకు నష్టం

పనమాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన దేశం.. భవనాలకు నష్టం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

ట్యాగ్లు
నారా లోకేష్సుజ్లాన్పవన విద్యుత్ఆంధ్రప్రదేశ్అనంతపురంపునరుత్పాదక ఇంధనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?
గాసిప్స్

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..
గాసిప్స్

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?
సినిమాలు

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?

రామాయణకు ప్రచార లోటు?
గాసిప్స్

రామాయణకు ప్రచార లోటు?

ఫౌజీ vs వారణాసి?
గాసిప్స్

ఫౌజీ vs వారణాసి?

టాలీవుడ్‌లో మూడు క్రేజీ కాంబినేషన్లు?
గాసిప్స్

టాలీవుడ్‌లో మూడు క్రేజీ కాంబినేషన్లు?

వారణాసి తర్వాత మళ్లీ సినిమా చేయనున్న మహేష్‌ రాజమౌళి?
గాసిప్స్

వారణాసి తర్వాత మళ్లీ సినిమా చేయనున్న మహేష్‌ రాజమౌళి?

బాలీవుడ్: ఏక్తా కపూర్‌ సత్తా?
సినిమాలు

బాలీవుడ్: ఏక్తా కపూర్‌ సత్తా?

పనమాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన దేశం.. భవనాలకు నష్టం
జనరల్

పనమాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన దేశం.. భవనాలకు నష్టం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ
జనరల్

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!