

సెప్టెంబర్ 17 తెలంగాణ, హైదరాబాద్ చరిత్రలో కీలకమైన రోజుగా నిలిచింది. 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం పొందినప్పటికీ, అప్పటి హైదరాబాద్ సంస్థానం వెంటనే భారత యూనియన్లో విలీనం కాలేదు. అనంతరం నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయ ఉద్యమాలు, సాయుధ రైతాంగ పోరాటం కొనసాగాయి. ఈ నేపథ్యంలో 1948 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ చేపట్టింది. అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది.
ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ సెప్టెంబర్ 17న వివిధ పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024 నుంచి ఈ రోజును ‘ప్రజా పాలన దినోత్సవం’గా అధికారికంగా నిర్వహిస్తోంది. మరోవైపు, ఇతర సందర్భాల్లో దీనిని తెలంగాణ విమోచన దినోత్సవం లేదా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా కూడా పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాటి సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను స్మరిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్యక్రమాల్లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి దారితీసిన పరిణామాలు, ఆపరేషన్ పోలోను గుర్తుచేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!