

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తమ దేశానికి అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరని పేర్కొంటూ, భారత్‌ను ఇజ్రాయెల్‌కు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ భాగస్వామ్య దేశాల గురించి మాట్లాడిన ఆయన, ఇజ్రాయెల్ ఒంటరిగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నప్పటికీ భారత్ నుంచి తమకు బలమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి కొనసాగుతుందని వెల్లడించారు.
ఇటీవలి సంవత్సరాల్లో భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, వ్యూహాత్మక సహకారం వంటి కీలక రంగాల్లో మరింత బలపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, రక్షణ, వాణిజ్యం, కార్మిక, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!