

జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల 60 కేజీల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత క్రీడాకారిణి సుచిక తరియాల్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. క్వార్టర్‌ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్ బైగల్మాను 2-0 తేడాతో ఓడించారు. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. ఫైనల్‌కు చేరేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో లేదా ఇరాన్‌కు చెందిన అరెజౌ సలీమిఘలేహ్తాకితో సుచిక తలపడనున్నారు.
మరోవైపు ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలోనూ భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ ఉత్తమ్ మాస్కర్, విదర్శా కె. వినోద్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిన భారత బృందం సిల్వర్‌ను సొంతం చేసుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!