

బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. AIMIM కార్పొరేటర్ సాహర్ షేక్ ముంబ్రాను ‘గ్రీన్’గా మారుస్తామని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నవనీత్ రాణా.. అన్నీ గ్రీన్‌గా కావాలనుకునేవారు పాకిస్థాన్‌కు వెళ్లాలని అన్నారు. భారత్‌లో కాషాయ రంగం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వివిధ రాజకీయ వర్గాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
మరోవైపు తన ‘గ్రీన్’ వ్యాఖ్యపై సాహర్ షేక్ వివరణ ఇచ్చారు. తన పార్టీ జెండా రంగును ఉద్దేశించే ఆ వ్యాఖ్య చేశానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఈ పరిణామాలతో రాజకీయాల్లో రంగులు, పార్టీ గుర్తులు, సాంస్కృతిక ప్రతీకలను ఎలా ఉపయోగించాలనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ముంబ్రా అంశంపై సాహర్ షేక్‌కు పోలీసులు కూడా నోటీసు జారీ చేసి, ప్రజా ప్రసంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!