
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు రజత పతకం సాధించింది. 1898.0 పాయింట్ల స్కోరుతో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఎలవెనిల్ వలరివన్, విదర్శా కె. వినోద్, సోనమ్ ఉత్తమ్ మాస్కర్‌లతో కూడిన భారత జట్టు ఈ ఘనతను సాధించింది.
భారత బృందంలో TOPS కోర్ అథ్లెట్ ఎలవెనిల్ వలరివన్, ఖేలో ఇండియా అథ్లెట్ విదర్శా కె. వినోద్, TOPS డెవలప్‌మెంట్ అథ్లెట్ సోనమ్ ఉత్తమ్ మాస్కర్ ఉన్నారు. ముగ్గురి సమిష్టి ప్రదర్శనతో భారత్ 1898.0 స్కోరు సాధించి రెండో స్థానంలో నిలిచింది. దీంతో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకం దక్కింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!