
ఆరోగ్యం

తెలంగాణ ప్రభుత్వం సచివాలయ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై సచివాలయం లోపలికి ప్రవేశించే ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి చేసింది. వాహనం ప్రవేశించే ముందు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే వాహనం నంబర్, యజమాని పేరు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. స్కానింగ్ లేకుండా సచివాలయంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని ఎస్‌పీఎఫ్ స్పష్టం చేసింది. నకిలీ ఉద్యోగులు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులను అడ్డుకునేందుకు, అలాగే వాహనాల రాకపోకలను డిజిటల్‌గా పర్యవేక్షించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!