

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, తనకు జడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌లో కృతజ్ఞత సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండపేటకు చేరుకుని ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత ఆలయ ఆవరణలో స్థానిక పెద్దలు, ఆత్మీయులతో సమావేశమై భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మిడ్జిల్‌కు చేరుకుని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అలాగే మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!