
జనరల్

స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత ఆర్మీకి చెందిన రోయర్లు హవిల్దార్ లక్ష్య మరియు హవిల్దార్ ఉజ్జ్వల్ కుమార్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ ఇద్దరూ కలిసి భారత్‌కు ఈ టోర్నీలో తొలి స్వర్ణ పతకాన్ని అందించి భారత రోయింగ్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. వారి విజయంతో అంతర్జాతీయ వేదికపై భారత రోయింగ్‌కు కొత్త గుర్తింపు లభించింది.
ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని జనరల్ ధీరజ్ సేథ్ ఇద్దరు విజేతలను ఘనంగా సత్కరించి అభినందించారు. దేశానికి గర్వకారణమైన ఈ విజయంతో భారత క్రీడాకారులకు కొత్త ఉత్సాహం లభించడమే కాకుండా, యువ రోయర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!