

దేశ ఆర్థికాభివృద్ధికి కీలక భూమిక పోషిస్తున్న భారతీయ రైల్వే, జూన్ 2026లో సరకు రవాణా, ప్రయాణికుల సేవల్లో గణనీయ వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో 142.21 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి, గత ఏడాదితో పోలిస్తే 4 శాతం వృద్ధి సాధించింది. సరకు రవాణా ద్వారా సుమారు ₹430 కోట్ల అదనపు ఆదాయం లభించినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఎరువులు, ఇనుప ఖనిజం, దేశీయ బొగ్గు, క్లింకర్‌తో పాటు ఇతర వస్తువుల రవాణాలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది.
ప్రయాణికుల సేవల్లో కూడా రైల్వే పురోగతి కొనసాగింది. జూన్ 2026లో 63.81 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించగా, గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 62.37 కోట్లుగా ఉంది. నాన్-సబర్బన్ ప్రయాణికుల సంఖ్య 3.9 శాతం, సబర్బన్ ప్రయాణికుల సంఖ్య 0.9 శాతం పెరిగింది. ఆధునిక రైలు సేవల విస్తరణలో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య 164కు చేరింది. 2026-27 తొలి త్రైమాసికంలో 419.08 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ నమోదవగా, థర్మల్ పవర్ ప్లాంట్లకు దేశీయ బొగ్గు సరఫరా 7 శాతం పెరిగి విద్యుత్ ఉత్పత్తికి రైల్వే కీలకంగా తోడ్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!