

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా అత్యంత వేగంగా (బంతుల పరంగా) 350 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి రబాడ 13,808 బంతులు మాత్రమే తీసుకున్నాడు. గతంలో ఈ రికార్డు 14,719 బంతులతో డేల్ స్టెయిన్ పేరిట ఉండేది. ప్రస్తుతం తన 75వ టెస్టు ఆడుతున్న రబాడ.. ఈ ఘనతతో టెస్టు క్రికెట్‌లో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.
టెస్టుల్లో 350కి పైగా వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ల జాబితాలో రబాడతో పాటు డేల్ స్టెయిన్ (439), షాన్ పొలాక్ (421), మఖాయ ఎన్తిని (390) ఉన్నారు. ఇక మాల్కమ్ మార్షల్‌తో కలిసి రబాడ ఈ ఘనతను సాధించిన టెస్టుల సంఖ్య పరంగా నాలుగో స్థానంలో నిలిచాడు. రిచర్డ్ హ్యాడ్లీ, డేల్ స్టెయిన్ 69 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకోగా, డెన్నిస్ లిల్లీ 70, గ్లెన్ మెక్‌గ్రాత్ 74 టెస్టుల్లో ఈ ఘనత సాధించారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన 133 టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!