

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 92 ఖాళీలు ఎలక్ట్రానిక్స్ (34), మెకానికల్ (26), కంప్యూటర్ సైన్స్ (13), సివిల్ (10), ఎలక్ట్రికల్ (4), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ (2), ఆర్కిటెక్చర్ (2), సివిల్ (పీఆర్‌ఎల్) (1) విభాగాల్లో ఉన్నాయి. అంతరిక్ష రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా సమాన అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 17, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 వేతనం తో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!