
సినిమాలు

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. సాధారణం కంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు సమాచారం. ఈ తీవ్ర వేడిమి ఎల్‌నినో ప్రభావానికి దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1877లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డును కూడా తాజా పరిస్థితులు అధిగమించినట్లు పేర్కొంటున్నారు.
పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత, గాలుల కదలికలు, వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎల్‌నినో బలపడితే భారత్‌లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!