

రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం.. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను చూసిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు.
ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే రామ్ చరణ్.. ‘ఇరుముడి’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందంగా ఉందని, రవితేజతో పాటు చిత్రబృందం చేసిన కష్టానికి ఈ ప్రశంసలు కచ్చితంగా అర్హమైనవేనని పేర్కొన్నారు. దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. చివరగా ‘స్వామి శరణం’ అంటూ తన పోస్టును ముగించారు.
తండ్రి–కూతురు అనుబంధం, 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని మేళవిస్తూ ‘ఇరుముడి’ తెరకెక్కింది. సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, పాటలు, శివ నిర్వాణ దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. గత చిత్రాలతో పోలిస్తే రవితేజ సహజమైన నటనతో మెప్పించడం కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!